తల లేని గణేశ్ విగ్రహం ఎక్కడుందో తెలుసా?

X
డెహ్రాడూన్: తల లేని గణేశ్ విగ్రహం కలిగిన అరుదైన ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. కేదార్ నాత్ యాత్రకు వెళ్తుండగా మార్గం మధ్యంలో ముండ్ కటియా గణేష్ ఆలయం గొప్ప పుణ్య క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయంలో తల లేని వినాయక విగ్రహం కొలువై ఉంది. పురాణ కథనం ప్రకారం.. పార్వతీదేవి సృష్టించిన బాల గణేశుడి తలను శివుడు ఖండించిన ప్రదేశం ఇదేనని స్థానికులు విశ్విస్తున్నారు. అనంతరం గణేశుడికి ఏనుగు తలను అమర్చి శివుడు పునర్జీవం ప్రసాదించాడని చెబుతారు. మందాకినీ నది తీరంలో ఉన్న ఈ ఆలయాన్ని కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు దర్శించుకొని పునీతులవుతారు. తల లేని గణేశుడి ఆలయంగా ప్రసద్ధిగాంచింది. వినాయక చవిత సందర్భంగా భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
