శ్రీశైలంకు భారీ వరద

శ్రీశైలంకు  భారీ వరద
X
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తుంగభద్ర నది నుంచి 5 లక్షల పది వేల క్యూసెక్కుల భారీ వరద శ్రీశైలం జలాశయానికి

శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తుంగభద్ర నది నుంచి 5 లక్షల పది వేల క్యూసెక్కుల భారీ వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ వైపునకు నాలుగు లక్షల 26 వేల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 65 వేల క్యూసెక్కుల చొప్పున 4 లక్షల 90 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాలకు భారీ వరద వస్తుండడంతో 4 లక్షల 63 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపునకు వదులుతున్నారు. సుంకేసుల బ్యారేజీ ద్వారా 43 వేల క్యూసెక్కులు, హంద్రీ నది ద్వారా 3,750 క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడం, క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు నమోదు అవుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై క్రమ ‚క్రమంగా గేట్లను ఎత్తుతూ నీటిని దిగువకు వదులుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే స్థాయిలో వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story