ఇవాళ్టి నుంచి ఐదు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

X
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎపిలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, విజయవాడలో వర్షం కురిసింది. ఎల్లుండి విశాఖ-గోపాల్పూర్ వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్లలో వర్షాలు పడే అవకాశం ఉంది. వికారాబాద్, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, యాదాద్రి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జగిత్యాల, మంచిర్యాలు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Tags
Next Story
-
Home
-
Menu
