తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల నిరీక్షణ!

తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల నిరీక్షణ!
X

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని 84,014 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.4. 28 కోట్ల ఆదాయం వచ్చినట్లు టిటిడి వెల్లడించింది. అలాగే 30,116 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ అధికారులు దర్శనం, వసతి, ఇతర సౌకర్యాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Tags

Next Story