చివరకు నిర్దోషిగా బయటకు వచ్చా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమేడియన్‌గా ఎన్నో విభి న్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన హేమ తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో సోమవారంనాడు జరిగింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై ఆమె భావోద్వేగంగా స్పందించారు. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ “డ్రగ్స్ కేసులో నాపై వచ్చిన ఆరోపణలు నన్ను తీవ్రంగా మానసికంగా కలచివేశాయి. ఆ సమయంలో నేను చచ్చిపోవాలనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయాను. అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు, గౌరవ అధ్యక్షులు ప్రభు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, పలువురు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
