అక్కడ.. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించిన హైకోర్టు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లా మహబూబపట్నం పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు.. ఒక సర్పంచ్, మూడు వార్డులు ఎలా రిజర్వ్ చేశారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉంటే.. మిగతా రెండు వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని సర్కార్ ను హైకోర్టు వివరణ కోరింది.
కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. అయితే, బిసిలకు సరైన విధంగా రిజర్వేషన్లు కేటాయించలేదని.. ఈ ఎన్నికలపై స్టే విధించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
-
Home
-
Menu
