మహబూబ్‌ పట్నం ఎన్నికలపై హైకోర్టు స్టే

High Court Adjourns Hearing On Local Body Elections
X

High Court Adjourns Hearing On Local Body Elections

మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టిలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆరుగురు ఎస్టి ఓటర్లు ఒకటే వార్డులో ఉంటే, మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. పంచాయతీలో రిజర్వేషన్లు సరిగా చేయలేదని, దీంతో రిజర్వేషన్లు మార్చాలని గ్రామానికి చెందిన మిట్టగుడుపుల యాకూబ్, శ్రీకాంతాచారి, లింగయ్య, నాగయ్య, విజయ్, వెంకటమల్లు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం మహమూద్‌పట్నంలో గ్రామపంచాయతీలో మూడు ఎస్టి కుటుంబాలకు చెందిన ఏడుగురు ఓటర్లుండగా,

సర్పంచ్‌తో పాటు మూడు వార్డులు ఎస్టికి కేటాయించారని పిటిషనర్ తెలిపారు. మహమూద్‌పట్నం గ్రామ పంచాయతీ నుంచి తండాలను వేరు చేసి కొత్త జీపిలు ఏర్పాటు చేసిన అనంతరం గ్రామంలో 576 ఓట్లు ఉన్నట్లు పిటిషనర్ పేర్కొన్నారు. గ్రామంలో 199 మంది ఎస్సిలు, 358 మంది బిసిలు, 13 మంది ఓసిలు, ఏడుగురు ఎస్టిలు ఓటు హక్కును కలిగి ఉన్నారని, అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డులు ఎస్టికి దక్కాయని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు వివరించారు. జనాభా, ఓటర్ల లెక్క సరిగా లేకపోవడంతో రిజర్వేషన్లు తప్పుగా ఇచ్చిరని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలపై స్టే విధించి, ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది.

Tags

Next Story