అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది: చంద్రబాబు

అమరావతి: కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఉందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర బడ్జెట్ బాగుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ పై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీలో మనం నెంబర్ వన్ గా ఉన్నామని, ఎమ్ఎస్ఎమ్ఇ లకు ప్రోత్సాహం అందించేలా దీర్ఘకాలక లాభాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశ పెట్టారని అన్నారు. గొప్ప బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలియజేశారు. బడ్జెట్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఎపికి మూడు హై స్పీడ్ కారిడార్ లు రాబోతున్నాయని తెలియజేశారు. హైస్పీడ్ కారిడార్ లతో ఎపికి మేలు జరగుతుందని, భారత్ వేగంగా ఎఐ అందిపుచ్చుకుంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిపారని ఎన్డిబి రిపోర్టు ఇచ్చిందని, ఆ రిపోర్ట్ నే తాను చెప్పానని అన్నారు. తప్పు చేసి వైసిపి మళ్లీ ఎదురు దాడి చేస్తుందని చంద్రబాబు విమర్శించారు.
-
Home
-
Menu
