‘స్వయంభు’ టీజర్ వచ్చేస్తోంది

‘స్వయంభు’ టీజర్ వచ్చేస్తోంది
X

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్‌కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్‌తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది. తాజాగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎంతగానో ఎదురుచూస్తున్న స్వయంభు టీజర్ ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నిఖిల్ యాక్షన్ లుక్ అదిరిపోయింది. స్వయంభు నిఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.



Tags

Next Story