హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ రెండు ఒకటేనా?

ఒకటి కాదు ఎందుకంటే హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమినో డెఫిషియన్సీ వైరస్ అనే వైరస్ వల్ల వచ్చే ఒక వ్యాధి.. ఇది అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల కానీ లేక సక్రమ మార్గంలో ప్రికాషన్స్ లేకుండా రక్తం మార్పిడి చేయకపోవడం వలన ఒకరికి వాడిన ఇంజక్షన్లు మరొకరికి వాడడం వలననో వస్తుంది. ఒక వ్యక్తి లోకి హెచ్ఐవి వైరస్ ప్రవేశిస్తే మనము పరీక్ష చేసినప్పుడు వారికి హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ చేస్తాం. కానీ వాళ్లకందరికి ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఉన్నట్లు కాదు. హెచ్ఐవి వైరస్ బాగా మల్టీప్లై జరిగి శరీరంలో తన సంఖ్యను విస్తరించుకొని మన యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి మన ఇమ్యూనిటీని తగ్గించి మామూలుగా వచ్చే ఇన్ఫెక్షన్లను ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది అంతేకాక కొన్ని రకాల ప్రత్యేక ఇన్ఫెక్షన్స్ లాంటివి మనకు వస్తాయి. సిడి4 కౌంట్ చేయడం వలన ఒక వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ ఎలా ఉంది ప్రస్తుతం అనే విషయాన్ని మనం గమనించవచ్చు. వీరికి తగు సమయంలో ఇప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ ఇవ్వడం వలన వ్యాధి తీవ్రత తగ్గించి వారికి ఉపశమనం కలిగించవచ్చు.
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతను హెచ్ఐవి పాజిటివ్ అయివుండవచ్చు అతను ఎయిడ్స్ కు గురి అయ్యేంతవరకు అతనిలో ఎటువంటి లక్షణాలు ఉండవు.. అతను ఆరోగ్యంగా మన మధ్యనే సంచరిస్తూ ఉంటాడు అతనికి హెచ్ఐవి ఉన్నట్లు అతనికే తెలియదు.. ఇటువంటి వ్యక్తులతో అసురక్షిత లైంగిక సంపర్కం అంటే కాండోమ్ లేకుండా కలవడం వలన హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మనకు సోకవచ్చు. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ రేట్ బాగా పెరుగుతుంది.. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు కదా ఎయిడ్స్ తగ్గిపోయింది అని మనం అనుకున్నాం. కానీ మనకు కోవిడ్ లాంటి వైరస్లు, ప్రతి సంవత్సరము కొత్త కొత్త వైరస్ లో వస్తుండంవల్ల ఈ ఎయిడ్స్ ను పట్టించుకోవడం మానేశాము. ఇది చాపకింది నీరులా విస్తరించింది. ఇప్పుడు మరలా అత్యధికంగా కేసులో నమోదు అవుతున్నాయి అని వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మన మెట్రోపాలిటన్ నగరాలు ఇందుకు కొత్త బ్రీడింగ్ ప్లేసెస్ అని నివేదిక వచ్చింది.
అదేంటి అందరూ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా ఎలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటే మీకు తెలియని ఒక షాకింగ్ విషయం ఏమంటే ఇది సాఫ్ట్వేర్ పర్సన్స్ లో ఎక్కువగా ఉందంట. ఎవరైతే కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక బటన్ తో సమస్త సమాచారాన్ని తెలుసుకోగలరో వారిలోనే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం మనలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇప్పుడు మరలా మనం ఎయిడ్స్ పై ప్రచారాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు ముఫై సంవత్సరాల కింద ఏ విధంగా మనం ఎయిడ్స్ పరీక్షలు చేసే వాళ్ళము ఇప్పుడు అలాగే అందరికీ చేయడం కూడా చాలా అవసరం. అంతేకాకుండా మనం ఎలాగో బ్లడ్ పరీక్షలు చేయించుకుంటామో అప్పుడు ఈ హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం కూడా మంచిది.. ఎందుకంటే ఇది కేవలం సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ కాదు బ్లడ్ ట్రాన్స్ఫషన్ వలన మరియు నీడిల్స్ వలన కూడా వస్తుంది మనకు తెలియకుండా ఆ వైరస్ మనలో ప్రవేశించి ఉండొచ్చు.
మనకు తెలియని వ్యక్తులతో లైంగిక సంపర్కం అవాయిడ్ చేయడం మంచిది.. నిరోద్ వాడడాన్ని ఎక్కువగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది అని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పుడు మరలా చెప్తుంది. నిరోద్ వాడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కేవలము హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడమే కాకుండా మిగతా సెక్సువల్లి ట్రాన్స్మిటెడ్ డిసీస్ ను ఆపడం అంతేకాకుండా అవాంఛిత గర్భాన్ని ఆపడం కూడా కాండోమ్ చేస్తుంది. మనము సెక్స్ గురించి కాండోమ్ గురించి మరియు ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పుగాను అది ఒక అనాగరికంగాను మనం భావించరాదు. మనము ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి. తమ అభిప్రాయాలను పంచుకోవాలి. పదిమందికి ఈ విషయాలు తెలియడం వలన వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎయిడ్స్ లేని సొసైటీ రావాలి అంటే ఇవన్నీ తప్పనిసరి. మీరేమంటారు?
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
-
Home
-
Menu
