చిరు డ్యాన్స్ అదుర్స్.. ‘హుక్ స్టెప్’ వీడియో సాంగ్ రిలీజ్..

Hook Step
X

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన శంకరవర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ వింటేజ్ చిరూని చూశామని సంబరపడిపోయారు. అంతేకాక.. ఈ సినిమాలో అందరినీ మెప్పించిన మరో అంశం ‘హుక్ స్టెప్’ సాంగ్. ఈ పాటలో చిరు ఈ వయస్సులో కూడా డ్యాన్స్ ఇరగదీశారు. దీంతో సినిమా రిలీజ్‌కి ముందే పాటకి మంచి హైప్ వచ్చింది.

సోషల్‌మీడియాలో చాలా మంది ఈ పాటపై రీల్స్ చేసి పోస్ట్ చేశారు. ఇక సినిమా విడుదల తర్వాత అందరూ హుక్ స్టెప్ సాంగ్‌కి ఫిదా అయిపోయారు. అయితే తాజాగా ఈ పాట పూర్తి వీడియో సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ పాటని ఆట సందీప్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఇక సినిమా విషయానికొస్తే.. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.350 కోట్లు వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించారు.



Tags

Next Story