డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్‌తో.. భయపెడుతున్న ‘హనీ’ ట్రైలర్..

హారర్ చిత్రాలు అంటేనే వాటికి ఉండే క్రేజ్ వేరు. ఎంత భయంగా ఉన్నా సరే.. హారర్ చిత్రాలు చూడాలనే ఫాంటసీ చాలా మందిలో ఉంది. అలా హారర్ జానర్‌లో వచ్చిన చిత్రాలు దాదాపుగా ప్రేక్షకాదరణ పొందుతాయి. కొన్ని ఫెయిల్ అవుతాయి. అలా ఓ డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘హనీ’. నవీన్ చంద్ర, దీపికా పిళ్లై, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. శేఖర్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘ఓ దేవత వాహనం పిల్లి’ అంటూ ట్రైరల్ ప్రారంభ అవుతుంది. ఆ తర్వాత ట్రైలర్ ఆద్యంతం భయపట్టే విధంగా ఉంది. ఆ పిల్లి ఎవరి వద్ద ఉంటే వారికి ఇతరులు దాసోహం కావడమనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా.. రవి పీట్లా నిర్మించారు. ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
-
Home
-
Menu
