ఎసిబి వలలో హాస్టల్ వార్డెన్

తన కింద పనిచేసే ఉద్యోగి వద్ద నుండి లంచం తీసుకుంటూ హాస్టల్ వార్డెన్ ఎసిబికి చిక్కిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎసిబి డిఎస్పి వై రమేష్ తెలిపిన వివరాల మేరకు... భద్రాద్రి జిల్లా చర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో హాస్టల్ వార్డెన్‌గా పని చేసే భూక్య వాల్ సింహా హాస్టల్లో వంట కుక్‌గా పని చేసే ఒక వ్యక్తి ఆరు రోజుల సెలవుకు అనుమతి అడగగా సెలవుల మంజూరుతో పాటు అనంతరం సెలవులు లేకుండా బిల్లులు చేయడానికి 20వేల రూపాయలు డిమాండ్ చేయగా,
ఆ వ్యక్తి ఎసిబిని ఆశ్రయించాడు. ముందస్తు ప్రకారం వంట మనిషి 14వేల రూపాయలు హాస్టల్ వార్డెన్‌కి ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి వరంగల్ ఎసిబి కోర్టులో హాజరు పరిచామని ఎసిబి అధికారులు వెల్లడించారు. ఎవరైనా అవినీతి అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమ టోల్‌ఫ్రీ నెంబర్ 106491543కి ఫోను చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల పేరును గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు.
-
Home
-
Menu
