ఇందిరమ్మ ఇళ్లు.. లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన హౌసింగ్ ఏఈ

ఇందిరమ్మ ఇళ్లు.. లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన హౌసింగ్ ఏఈ
X

మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. శ్రీకాంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేశామని, అలాగే ఆయన్ను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఎండి గౌతమ్ తెలిపారు. ఇళ్ల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఎవరైనా అధికారులు నిరాకరిస్తే లబ్ధిదారులే యాప్ లో ఆ ఫొటోలు పెట్టుకోవచ్చని ఎండి తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే కాల్ సెంటర్ (18005995991) కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎండి గౌతమ్ సూచించారు.

ఫొటోల అప్‌డేట్ కోసం రూ.10 వేలు

కాగా, ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలంలోని హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఏఈగా పని చేస్తున్న శ్రీకాంత్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డాడు. ఓ లబ్ధిదారు ఇంటికి సంబంధించిన ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి మొత్తం రూ. 20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసిబిని ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు అతడు డిమాండ్ చేసిన డబ్బుల్లో రూ. 10 వేలు ఇస్తుండంగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Tags

Next Story