మేడారంలో భక్తుల రద్దీ

మేడారంలో భక్తుల రద్దీ
X

రోజురోజుకూ పెరుగుతున్న జనసందోహం

వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్న మేడారం రహదారులు

వన దేవతలను దర్శించుకున్న డిప్యూటీ సిఎం భట్టి సహా ఆరుగురు మంత్రులు

అభివృద్ధి పనుల పరిశీలన

మన తెలంగాణ/తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. వారాంతరం ఉండటంతో దేవతలను దర్శించుకునేందుకు వేలాదిగా కుటుంబాల సమేతంగా తరలివచ్చారు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి తలనీలాలు అర్పించారు. సంతానం కోసం జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. గద్దెల ప్రాంగణానికి వచ్చి ఎత్తు బెల్లం ఒడి బియ్యం పూలు పండు నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు.

అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి రోజంతా ఆటపాటలతో గడిపారు రుచికరమైన భోజనాలు తయారు చేసుకుని బంధుమిత్రులను ఆహ్వానించి విందు భోజనాలు వడ్డించారు. పెరిగిన భక్తుల రద్దీతో మేడారంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ప్రదేశాలకు తరలించారు. గద్దెల ప్రాంగణంలో తొక్కిసలట జరగకుండా ఉండేందుకు భక్తులను క్రమ పద్ధతిలో దర్శనానికి అనుమతించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రలు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ దేవతలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ గద్దెల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు పెరిగిన భక్తులతో మేడారంలో వ్యాపారాలు జోరుగా సాగాయి.

Tags

Next Story