భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్: కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధి గాంచిన వరంగల్ మహా నగరంలో పరమ పావనమైన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవాస్థనంలో గురువారం ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని ఉదయం నుంచి రాత్రి ద్వారా బంధనం వరకు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవాలయ ముఖ ద్వారం సుందరంగా వివిధ రకాల పూలతో అలంకరించారు. నూతన సంవత్సరం ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆ యురారోగ్యాలతో, ఐశ్వర్యంతో ఉండాలని అమ్మవారికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు ప్రసాదాలు తదితర ఏర్పాట్లు ఆలయ ధర్మకర్తలు కటకం రాములు, ఓరుగంటి పూర్ణచందర్, నార్ల సుగుణ, మోతుకూరి మయూరి రామేశ్వర్‌రావు, తొగరు క్రాంతి, పాలడుగుల ఆంజనేయులు, అనంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
