ముల్కనూర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ముల్కనూర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
X

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంగా అక్రమంగా తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ముల్కనూర్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో పేలుడు సామాగ్రి బయటపడింది. పోలీసుల తనిఖీల్లో సుమారు 180 పెట్టెల జిలేటిన్ స్టిక్స్, 1950 డిటోనేటర్లు, రెండు తూటాల వైర్ బండిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రవాణాకు ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు.

పట్టుబడిన ఈ పేలుడు పదార్థాల మొత్తం విలువ సుమారు రూ.7,07,500లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.ఆటోలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఒకరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకోగా, మరొకరు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని, నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. పరారైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

Tags

Next Story