హైదరాబాద్‌ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సిఎం రేవంత్

హైదరాబాద్‌ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సిఎం రేవంత్
X

హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్లలో టూరిజం పాలసీ లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్‌కి సిఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న పలువురికి అవార్డులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చామని తెలిపారు.

‘‘గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రముఖ పర్యాటక స్థలాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఎకో, మెడికల్, హెల్త్, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సాహించాలని నిర్ణయించాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. హైదరాబాద్‌లో రక్షణ, శాంతి భద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ.. ప్రపంచ సుందరీమణుల పోటీలను విజయవంతంగా నిర్వహించాం’’ అని సిఎం రేవంత్ అన్నారు.

Tags

Next Story