కాప్రా సాకేత్‌లో రియల్టర్ దారుణ హత్య

కాప్రా సాకేత్‌లో రియల్టర్ దారుణ హత్య
X

హైదరాబాద్ శివారు ప్రాంతం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ కాప్రా సాకేత్‌లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది.పాత కక్షలతో దుండగులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి,బండరాయితో మోది, తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన సోమవారం ఉదయం 8 గంటలకు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాకేత్‌లో వెలుగు చూసింది.మృతుడు కాప్రా సర్కిల్ పరిధిలోని సాకేత్‌లో నివసించే ఘంటా వెంకటరత్నం (54)గా పోలీసులు గుర్తించారు.పక్కా పథకం ప్రకారం నలుగురు వ్యక్తులు ఆటోలో,బైక్‌పై మరో ఇద్దరు వెంకటరత్నంను ఫాలో అవుతూ ఆటోను స్కూటీకి అడ్డగించి కత్తులతో విచక్షణరహితంగా దాడిచేశారు.అంతటితో ఆగకుండా తుపాకీతో కాల్చి తిరిగి అదే ఆటోలో పారిపోయారు.ఈ సంఘటనతో స్థానికులు భయాందోనళకు గురయ్యారు.సమాచారం అందుకున్న జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు.

పోలీసుల వివరాల ప్రకారం కాప్రా సాకేత్‌లో నివసించే ఘంటా వెంకటరత్నం (54) రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన కూతురిని సాకేత్‌లోని ఫాస్టర్ బిల్లా బాంగ్ స్కూల్‌లో వదిలి తిరిగి ఇంటికి స్కూటీపై వస్తుండగా ఆరుగురు వ్యక్తులు ఆటోను అడ్డంగా ఉంచి అతనిపై కత్తులతో దాడి చేశారు.విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా తుపాకీతో షూట్ చేసి పారిపోయారు. వెంకటరత్నంను హత్య చేయడానికి నిందితులు గత కొంత కాలంగా రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది.మృతుడు వెంకటరత్నం గతంలో దూల్‌ఫేటలో రియల్ ఏస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు.అతనిపై అక్కడ రౌడిషీట్‌తో పాటు హత్య నేరారోపణలు ఉన్నాయి.సాకేత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికి అక్కడి ఆర్థిక,వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.మృతుడి తల్లి,భార్య పిల్లలు మృతదేహం వద్ద బోరున విలపించారు.

తన కుమారుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని తల్లి పోలీసుల ముందు వాపోయింది.మల్కాజ్‌గిరి డివిజన్ డిసిపి సిహెచ్.శ్రీధర్ ఘటన స్థలాన్ని సందర్శించి హత్యకు దారితీసిన విషయాలపై అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమోరాల పుటేజీని పరిశీలిస్తున్నామని, తొందరలోనే నిందితులను పట్టుకుంటామని డిసిపి శ్రీధర్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదయ్య తెలిపారు.

Tags

Next Story