మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు : హైడ్రా కమిషనర్

మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు : హైడ్రా కమిషనర్
X

హైదరాబాద్: మూసీ పరివాహక ప్రజలకు ఇబ్బందుల్లేకుండా యుద్ధప్రాతికన చర్యలు చేపట్టామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజిబిఎస్ వరద పోటెత్తిందని, ఎంజిబిఎస్ లో డిఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపడుతున్నారని తెలియజేశారు. ఎంజిబిఎస్ పరిస్థితి అదుపులోకి వచ్చిందని, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.


Tags

Next Story