వేలాది బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్!

వేలాది బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్!
X

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. కాగా, దరఖాస్తు ప్రక్రియ ఈరోజు 1 జూలై 2026న IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inలో ప్రారంభం కానుంది.


పోస్టుల వివరాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా: 1,900 పోస్టులు

కెనరా బ్యాంక్: 1,500 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 1,100 పోస్టులు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 550 పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్: 504 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియా: 500 పోస్టులు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 500 పోస్టులు

పంజాబ్ & సింధ్ బ్యాంక్: 161 పోస్టులు

వయో పరిమితి

జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి (అనగా, జూలై 2, 1996 కంటే ముందు మరియు జూలై 1, 2006 కంటే తరువాత జన్మించి ఉండకూడదు). ఇక SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు, OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు లభిస్తుంది.

విద్యార్హత

జూలై 21, 2026 నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ.175.

మిగతా (జనరల్, OBC, EWS) అభ్యర్థులకు: రూ.850

పే స్కేల్

ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ బేసిక్ పే రూ.48,480/- నుండి ప్రారంభమవుతుంది. దీనికి అదనంగా, సంబంధిత బ్యాంకు నిబంధనల ప్రకారం వివిధ అలవెన్సులు, ప్రయోజనాలు సైతం అందుతాయి.

ఎంపిక ప్రక్రియ

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ.

పరీక్షా విధానం

ప్రిలిమ్స్ పరీక్ష: ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి (ఇంగ్లీష్ నుండి 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35, రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు). ఈ పరీక్షకు కేటాయించిన సమయం 60 నిమిషాలు.

మెయిన్స్ పరీక్ష

ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం 170 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షకు కేటాయించిన సమయం 160 నిమిషాలు. రీజనింగ్ (40 ప్రశ్నలు, 60 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లీష్ (40 ప్రశ్నలు, 20 మార్కులు), డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ (40 ప్రశ్నలు, 60 మార్కులు). అదనంగా, 25 మార్కులకు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది.

నెగటివ్ మార్కింగ్:

ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ తప్పు సమాధానాలు ఇస్తే ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 1/4 (0.25) వంతు తగ్గించబడుతుంది.

పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ

మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారు పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. దీని మార్కులను మెరిట్ జాబితాలో పరిగణించరు. దీని తర్వాత 100 మార్కులకు మెయిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 40% మార్కులు (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీలకు 35%) అవసరం.

తుది ఎంపిక

మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా 80:20 వెయిటేజ్‌తో తుది మెరిట్ జాబితాను తయారుచేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు తేదీలు: జూలై 1, 2026 నుండి జూలై 21, 2026 వరకు

ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2026.

మెయిన్స్ పరీక్ష: అక్టోబర్ 2026.

పర్సనాలిటీ టెస్ట్: నవంబర్ 2026.

ఇంటర్వ్యూ: నవంబర్/డిసెంబర్ 2026.

Tags

Next Story