పెరిగిన మీ సేవా చార్జీలు

పెరిగిన మీ సేవా చార్జీలు
X

ప్రజలకు ,ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పలు సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాల్లో పలు సర్వీసు చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన చార్జీలు బుధవారం నుంచే అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టంగా పెర్కొంది. వినియోదారులకు అందిస్తున్న సర్వీసులను రెండు రకాలుగా విభిజస్తూ ఏ ( రీ ఇస్యూ ఆఫ్ సర్టిఫికేట్స్,ఈసీ ( ఇన్‌కంబర్‌రెన్స్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్)కేటగిరిలోని సర్వీసులకు రూ.62 రూపాయలను, అదే విధంగా బి కేటగిరి సర్వీసు( ఇన్‌కమ్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, రెసెడెన్స్ సర్టిఫికెట్, అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూర్టీ కార్డు, కరక్షన్ ఆఫ్ పుడ్ సెక్యూర్టీ కార్డు,ఓబీసి సర్టిఫికేట్, లేట్ బర్త్,డెత్ సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ న్యూ కనెక్షన్ సర్టిఫికెట్, ఫ్యామీలీ మెంబర్‌షిప్ సర్టిఫికెట్,ఈడబ్లూస్ సర్టిఫికేట్, ఈ డబ్లూస్ సర్టిఫికేట్,భూ భారతి కేవైసీ,

ఈబీసీ సర్టిఫికెట్) కు రూ 80 వసూలు చేయాలని పేర్కొంది. కొన్ని విద్యుత్‌శాఖ, రవాణాశాఖలు తమ సేవలను వినియోగాదారులకు అందించేందుకు ప్రత్యేకంగా యాప్‌లను, ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చుకొగా ఇతర శాఖలకు సంబంధించిన సేవలను ఈ సేవా కేంద్రాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా జిహెచ్‌ఎంసిలో పరిధిలోకి వచ్చే బర్త్, డెత్ సర్టిఫికెట్‌ల జారీ సేవలను అనేక మంది వినియోగదారులు వినియోగించుకుంటున్నారు.నగరంలో ఉన్న 56 కేంద్రాలు ప్రజలకు సుమారు 100కు పైగా సేవలను అందిస్తున్నాయి.వినియోగదారులు అవగాహన కోసం సర్వీసు చార్జీల పెంపునకు సంబంధించి ఈ సేవా కేంద్రాల్లో బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు.

Tags

Next Story