కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆసీస్‌తో సిరీస్ క్లీన్ స్వీప్

రాజ్‌కోట్: ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మూడు అనధికారిక వన్డేల సిరీస్‌ని భారత అండర్-19 జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో అనధికారిక వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 254 పరుగులకు అలౌట్ అయింది. ఓపెనర్ జెడ్ హోలిక్(87), నీల్ పటేల్(51) అర్థ శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో మోహిత్ ఉల్వ, మోనల్ చౌహన్ తలో మూడు వికెట్లు తీయగా.. ఆర్యన్ సవసాని, కావ్య పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్‌కు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ శుభారంభం అందించాడు. 31 బంతులు ఎదురుకున్న అతడు 5 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ లక్ష్య రాయ్‌చందన్ ఆసీస్ బౌలర్లను టార్గెట్ చేశాడు. ఆచితూచి ఆడుతూ.. 100 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 106 బంతులు ఎదురుకున్న అతడు 9 ఫోర్లు, 3 సిక్సులతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరితో పాటు కుశాగ్ర ఓఝా(45), రజత్ బఘేల్ (44 నాటౌట్) రాణించారు. ఫలితంగా భారత్ 4 వికెట్లు కోల్పోయి 41.2 బంతుల్లో లక్ష్యాన్ని చేధించింది. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ గ్రీన్ రెండు వికెట్లు సాధించాడు.
-
Home
-
Menu
