బౌండరీలతో విరుచుకుపడిన పాండ్యా.. దక్షిణాప్రికా టార్గెట్ ఎంతంటే?

భారత్ టాపార్డర్ చేతులెత్తేసిన వేళ హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చి రాగానే భారీ సిక్సులతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ మంచి స్కోరు సాధించింది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(23) కూడా వెనుదిరగాడు. దీంతో టీమిండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో పాండ్యా, శివమ్ దూబే(23)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధనా ధన్ బ్యాటింగ్ తో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. పాండ్యా 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక, చివర్లో జితేష్ శర్మ 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
-
Home
-
Menu
