సెంచరీతో కదం తొక్కిన నారాయణ్.. ఇండియా ఎ భారీ స్కోర్

Narayan Jagadeesan
X

నవీ ముంబై: టి-20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా యుఎస్‌ఎతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఇండియా ఎ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ నారాయణ్ జగదీషన్ సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యుఎస్ఎ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే 43 పరుగుల వద్దే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(28) ఔట్ అయ్యాడు. కానీ, మరో ఓపెనర్ నారాయణ్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.


శస్త్ర చికిత్స నుంచి కోలుకొని తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్న తిలక్ వర్మ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక ఆయుశ్ బదోనీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. యుఎస్ఎ బౌలింగ్‌లో శుభం రంజనే, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.

Tags

Next Story