టీం ఇండియా ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే..

Pakistan U 19
X

బులవాయో: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా పాకిస్థాన్‌ యువ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ యువ జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌ దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీలు కలిసి తొలి వికెట్‌కి 47 పరుగులు జోడించారు. కానీ, 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాడు. ఈ దశలో కష్టాల్లో పడిన జట్టుకు వేదాంత్ త్రివేది అండగా నిలిచాడు. 98 బంతులు ఎదురుకున్న అతడు 2 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 68 పరుగులు చేశాడు. ఇక కనిష్క్ చౌహాన్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 35, అంబ్రిష్ 29, ఖిలన్ 21, విహాన్ 21 పరుగులు చేశారు. దీంతో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలింగ్‌లో సుభాన్ 3, సయ్యమ్ 2, రజా, హుస్సేన్, ఖమర్, హసన్ తలో వికెట్ తీశారు.

Tags

Next Story