ఆసియా క్రీడలు.. భారత్‌కు రెండో స్వర్ణ పతకం..

X
జపాన్‌లో ఆసియా క్రీడలు 2026 ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంలో అథ్లెట్లు పోటీ పడుతున్నారు. కాగా, ఇప్పటికే భారత్‌కు క్రికెట్‌లో స్వర్ణపతకం లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మన దేశానికి మరో స్వర్ణ పతకం లభించింది. షూటింగ్ విభాగంలో తొలుత మను బాకర్ వంటి స్టార్ షూటర్లు నిరాశ పరిచినా.. ఇప్పుడు ఏకంగా గోల్డ్ మెడల్ దక్కింద. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెం్‌లో భారత షూటర్లు కమల్‌జీత్, సురుచి సింగ్ స్వర్ణం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో భారత్‌కు రెండో పసిడి పతకం లభించింది. ఈ విభాగం మెడల్ రౌండ్‌లో మొత్తం నాలుగు జోడీలు ఫైనల్2కు అర్హత సాధించారు. ఇందులో కమల్‌జీత్, సురుచి కలిసి మొత్తంగా 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా ద్వయానికి రజతం, ఇరాన్ జోడీకి కాంస్యం దక్కాయి.
Next Story
-
Home
-
Menu
