అండర్-19 ప్రపంచకప్‌.. సెమీస్ కు చేరిన భారత్

అండర్-19 ప్రపంచకప్‌.. సెమీస్ కు చేరిన భారత్
X

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్ యువ జట్టు పాకిస్థాన్‌ యువ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35) విలువైన పరుగులు జోడించాడు. 253 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. కానీ భారత బౌలర్ల ధాటికి వారు కనీసం గెలవలేకపోయారు. ఉస్మాన్ ఖాన్ (66) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే తన స్పిన్ మ్యాజిక్‌తో 3 వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచాడు

Tags

Next Story