అదరగొట్టిన భారత కబడ్డీ జట్టు.. ఫైనల్స్‌కి దూసుకెళ్లింది..

Indian Kabaddi Team
X

ఐచి: ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళ కబడ్డీ జట్లు అదరగొడుతున్నాయి. ఇప్పటికే మహిళ జట్టు ఫైనల్స్‌కి దూసుకెళ్లగా.. తాజాగా పురుషుల జట్టు ఫైనల్స్‌కు చేరింది. శుక్రవారం ఐచి వేదికగా థాయ్‌లాండ్‌తో జరిగిన పోరులో ఘన విజయం సాధించి తుది పోరుకు చేరుకుంది. థాయ్‌లాండ్‌పై భారత్ 66-28 స్కోర్‌తో ఘన విజయం సాధించింది.

దీంతో ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్‌ పోరులో భారత పురుషుల కబడ్డీ జట్టు తైవాన్ లేదా ఇరాన్‌తో తలపడే అవకాశముంది. అంతకు ముందు భారత మహిళల కబడ్డీ జట్టు కూడా సత్తా చాటింది. సెమీ ఫైనల్‌లో నేపాల్‌ను 48-24 తేడాతో భారత్ చిత్తు చేసింది. కాగా టోర్నమెంట్‌లో మెన్స్, ఉమెన్స్ కబడ్డీ జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.

Tags

Next Story