టీం ఇండియా రికార్డు స్కోర్.. ఆసీస్‌కు భారీ లక్ష్యం..

విశాఖ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇక్కడి ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళ జట్టుకు మంచి ఆరంభం అందింది. ఓపెనర్లు స్మృతి, ప్రతికాలు కలిసి తొలి వికెట్‌కి 155 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్థ శతకాలు సాధించారు. స్మృతి మంధన 80 పరుగులు చేసి ఔట్ అయింది. ఆ తర్వాత 192 పరుగుల వద్ద ప్రతీక (75) పెవిలియన్ చేరింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌లో హర్లిన్ 38, జెమీమా 33, రిచ ఘోష్ 32, హర్మన్‌ప్రీత్ 22 పరుగులు చేశారు. వీళ్లు మినహా మిగితా వాళ్లు స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆసీస్ బౌలింగ్‌లో అన్నాబెల్ సదర్లాండ్ 5, సోఫీ మోలినెక్స్ 3, మేగాన్ స్కట్, ఆష్లీ గార్డెనర్ తలో వికెట్ తీశారు.
-
Home
-
Menu
