మారథాన్‌లో 44 ఏళ్ల తర్వాత పతకం.. భారత్‌కు డబుల్ సిల్వర్

ఆసియా క్రీడల్లో భారత జోరు.. ఒకే రోజు రెండు రజతాలు
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఏడో రోజు భారత క్రీడాకారులు రెండు రజత పతకాలు సాధించారు. మారథాన్‌తో పాటు షూటింగ్‌లోనూ రజతాలు దక్కాయి.
44 ఏళ్ల నిరీక్షణకు తెర
మారథాన్‌లో సావన్ బర్వాల్ రజత పతకం సాధించి భారత క్రీడలకు అరుదైన ఘనత అందించారు. ఆసియా క్రీడల మారథాన్ విభాగంలో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం రావడం విశేషం. సావన్ ప్రదర్శనతో ఈ విభాగంలో భారత పతకాల నిరీక్షణకు తెరపడింది.
షూటింగ్‌లోనూ మెరిసిన భారత త్రయం
షూటింగ్‌లో తిలోత్తమా సేన్ (590), విదర్శా కె. వినోద్ (588), ఆషి చౌక్సీ (585)తో కూడిన భారత బృందం రజత పతకం సాధించింది. ముగ్గురి సమిష్టి ప్రదర్శన భారత్‌కు మరో పతకాన్ని అందించింది. మూడు స్వర్ణాలు, 11 రజతాలు, 12 కాంస్యాలతో మొత్తం భారత పతకాల సంఖ్య 26కు చేరాయి. గత ఆసియా క్రీడల్లో భారత్ 28 స్వర్ణ పతకాలు సాధించింది. ప్రస్తుత క్రీడల్లో ఇంకా పలు ఈవెంట్లు మిగిలి ఉండటంతో భారత అథ్లెట్లు మరిన్ని పతకాలపై గురి పెట్టారు.
-
Home
-
Menu
