ఆల్‌టైమ్ కనిష్టానికి..

ఆల్‌టైమ్ కనిష్టానికి..
X

డాలర్‌తో పోలిస్తే రూపాయి 89.95కి పతనం

న్యూఢిల్లీ : అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. మంగళవారం నాడు డాలర్‌తో పోలిస్తే రూపాయి 42 పైసలు క్షీణించి 89.95కి పడిపోయింది. సోమవారం కనిష్టాన్ని కూడా దాటింది. దేశ జిడిపి 8.2 శాతం వృద్ధి నమోదైన వేళ రూపాయి భారీ పతనం ఆందోళన కలిగిస్తోంది. రూపాయి గత నెలలో 90 పైసలు క్షీణించగా, ఆరు నెలల్లో 4.4 శాతం పతనమైంది. అమెరికా సుంకాల ఉద్రిక్తత, వాణిజ్య చర్చలలో పురోగతి లేకపోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది. రూపాయి బలహీనతతో ముడి చమురు, బంగారం, యంత్రాలు, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

Tags

Next Story