ఇండిగో విమానాలు రద్దు.... ప్రయాణికుల ఆగ్రహం.. వైరల్ వీడియో

హైదరాబాద్: ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజే వెయ్యి విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు పడుతున్నారు. ఇవాళ కూడా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లలో పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 15లోగా సమస్య పరిష్కారం చేస్తామని ఇండిగో సిఇఒ సెలవిచ్చారు. సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే విమానాల్ని క్యాన్సిల్ చేశామని తెలిపారు. సిస్టమ్ రీబూట్ వల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇండిగో సంస్థ తమతో ఆటలాడుకుంటుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాలు రద్దు చేసి ఇండిగో సంస్థ చేతులు దులుపుకోవడంపై మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వడం లేదంటూ ప్యాసింజర్లు దుయ్యబట్టారు. ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్టుల్లో ఎక్కడ కనిపించిడం లేదు. ఎయిర్‌పోర్టుల్లో ప్యాసింజర్ల పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్‌లను పెంచింది. దక్షిణ రైల్వే18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది. తూర్పు రైల్వే 3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లు, నార్తర్న్ రైల్వే 8 రైళ్లలో థర్డ్ ఎసి, చైర్‌కార్ కోచ్‌లు పెంచింది. పశ్చిమ రైల్వే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లు, ఈస్ట్ సెంట్రల్ రైల్వే సెకండ్ ఏసీ కోచ్‌లను అదనంగా వేసింది. 10 రూట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు చేర్చింది.
Tags
-
Home
-
Menu
