ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజామాన్యాలదే బాధ్యత: రామ్మోహన్

X
ఢిల్లీ: రోస్టరింగ్ విషయంలో ఇండిగోలో సమస్య తలెత్తిందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సాఫ్ట్ వేర్ సమస్యలపై విచారణకు ఆదేశించామని అన్నారు. ఇండిగో సంక్షోభంపై లోక్ సభ లో కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు. ఇండిగో సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని, ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజామాన్యాలే బాధ్యత వహించాలని సూచించారు. జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన అవసరం వారిపై ఉందని తెలియజేశారు. ఎంత పెద్ద విమాన సంస్థ అయినా.. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Next Story
-
Home
-
Menu
