ఆదిలాబాద్ కు ఇండస్ట్రియల్ సిటీ వర్సిటీ

పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తాం బాసర ట్రిపుల్ ఐటిలో వర్సిటీ ఏర్పాటు 10వేల
ఎకరాలతో ఇండస్ట్రియల్ సిటీ నిర్మల్‌కు ఎటిసి పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్‌కు
నిధులు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సత్వర కృషి ఎర్రబస్సు తిరగని ఆదిలాబాద్‌కు
ఎయిర్ బస్సు తెస్తా మేం పాలకులం కాదు, సేవకులం నిర్మల్ ప్రజాపాలన ప్రగతిబాట
బహిరంగ సభలో సిఎం రేవంత్ చనాకా కొరటా, సదర్మాట్ బ్యారేజీలు ప్రారంభం
మన తెలంగాణ/నిర్మల్ ప్రతినిధి: ఆదిలాబాద్‌లో అతిపెద్ద పారిశ్రామికవాడ ఏర్పాటుకు పదివేల ఎకరాలు సేకరించి.. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధ్ది చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే, ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన యూనివర్సిటీ ఆలస్యమైన మాట వాస్తవమేనంటూ.. బాసర ట్రిపుల్ ఐటిలో యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుందామని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎన్‌టిఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మేం పాలకులం కాదు, సేవకులమని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. “ఇది జ ల్ జంగల్ జమీన్ అని నినదించిన పోరాటాల గడ్డ. ఉమ్మడి ఆదిలాబాద్‌లో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. అందు కే పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు ని ధులిస్తాం” అని ప్రకటించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు లు పూర్తైతే జిల్లా అభివృద్ధిపథంలో సాగేదన్నారు.
కారణాలు ఏవైనా.. ప్రాజెక్ట్‌లు పూర్తి కాలేదన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి కృషి చేస్తున్నామన్నారు. ‘ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్శిటీ మంజూరైనా.. ఎవరికి వారే తమ ప్రాంతానికే రావాలనుకోవడంతో యూనివర్సిటీ ఏర్పాటు జాప్యమైంది. బాసర ట్రిపుల్ ఐటిలో యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుందాం. ఇందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపెల్లి కృష్ణారావుకు సూచిస్తున్నా’ అన్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు నిర్వహించాలని సుదర్శన్ రెడ్డికి సూచించారు. ‘మీరు ఒక నివేదిక తయారు చేసి ఇవ్వండి. ఆదిలాబాద్‌కు కావాల్సిన అభివృద్ది, రావాల్సిన నిధులను మంజూరు చేసుకుందాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ రైతాంగానికి నీళ్లివ్వాలంటే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సిందేనన్నారు. బడ్జెట్ సమావేశాలలోపు తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌పై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సూచించారు. ఎర్రబస్సు తిరగని ఆదిలాబాద్‌లో ఎయిర్ బస్ తిరిగేలా ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసుకుందామన్నారు. కేవలం ఎయిర్‌పోర్టు ఒక్కటే సరిపోదని, ఆదిలాబాద్‌లో అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. పదివేల ఎకరాలు సేకరించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధ్ది చేసుకుందామన్నారు. నిర్మల్‌లో ఎటిసి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రజలకు మంచి జరుగుతుంటే పదేళ్లు అధికారం అనుభవించిన వాళ్లు చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసేవారిని, అభివృద్ది చేసేవారిని గెలిపించుకోవాలన్నారు. గత ఎన్నికల్లో గెలిచాం. రాబోయే ఎన్నికల్లో గెలుస్తాం. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. చనాక కొరటాకు సీ రామచంద్రా రెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామన్నారుఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రాజెక్ట్‌లన్నీంటినీ ఆధునికరించాలని కోరారు. నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్దికి అవసరమైన నిధులు కేటాయించాలన్నారు.
-
Home
-
Menu
