డ్యూయల్ డిస్ప్లేతో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో విడుదల

ఇన్‌ఫినిక్స్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రోను గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పాటు ప్రత్యేకమైన సెకండరీ LED డిస్‌ప్లేను అందించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 6000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుంది.
ధర వివరాలు
ప్రస్తుతం ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో ధరను కంపెనీ వెల్లడించలేదు. అయితే గ్లోబల్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను అధికారికంగా లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 6 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి నైట్ పల్స్, డైవ్ బ్లూ, డెప్త్ రింగ్ వైట్, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్, థర్మో ఆరెంజ్.
ఫీచర్లు
డిస్‌ప్లే: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 6.76 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇందులో 2344 × 1080 పిక్సెల్స్ ఫుల్ HD+ రిజల్యూషన్, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. ఫోన్ 45Hz నుంచి 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కు మద్దతు ఇస్తుంది. దీంతో గేమింగ్, స్క్రోలింగ్, వీడియో వీక్షణ మరింత స్మూత్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌లోని ప్రధాన హైలైట్ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ LED డిస్‌ప్లే. ఇది వెనుక భాగంలోని మూడో కెమెరా లెన్స్‌లోనే అమర్చబడింది. నోటిఫికేషన్లు, కాల్స్, ఇతర సమాచారం చూపించేందుకు ఈ సెకండరీ డిస్‌ప్లే ఉపయోగపడుతుంది.
పనితీరు: పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 8GB LPDDR4X RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్* ను జత చేశారు.
సాఫ్ట్‌వేర్: సాఫ్ట్‌వేర్ పరంగా ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16పై పనిచేస్తుంది. ఇన్ఫినిక్స్ ఈ ఫోన్‌కు 3 ప్రధాన ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు (Android 19 వరకు) అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే 2031 వరకు 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చింది.
కెమెరా: ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఇచ్చారు. ఒక అదనపు సపోర్టివ్ సెన్సర్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీను అందించారు. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
-
Home
-
Menu
