ప్రేమించాలని యువకుడి వేధింపులు..ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమించాలని ఒక యువకుడు వేధించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, పెద్దపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ తహసొద్దీన్ తెలిపిన కథనం ప్రకారం...బొడ్డు ఐశ్వరి (17) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 24న కళాశాలలో ప్రోగ్రాం ఉందని ఆమె కళాశాలకు వెళ్ళింది. అక్కడికి ఆమెను కొండాపూర్ గ్రామానికి చెందిన కొండ్లపల్లి అజయ్ తనను ప్రేమించాలని బలవంతం చేసి వేధించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తనను ప్రేమించకపోతే విషం తాగి చనిపోమని ఆమెను కొట్టాడు. కళాశాల లెక్చరర్ ఒకరు ఆమెను తీసుకొని వచ్చి పెద్దపేటలోని తమ ఇంటిలో అప్పజెప్పారు. కళాశాలలో జరిగిన జరిగిన విషయం గురించి ఆ విద్యార్థిని తన ఇంట్లో చెప్పి బాధపడింది. అవమానం భరించలేక ఈనెల 25న ఉదయం గడ్డి మందు సేవించింది. స్నానం చేయడానికి ఐశ్వరి బాత్రూంలోకి వెళ్లగా నోటి నుండి నురగలు వచ్చి వాంతులు చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి బొడ్డు అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
-
Home
-
Menu