ఫోన్ చూడొద్దన్నందుకు ట్యాంక్ ఎక్కి... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఇంటర్ విద్యార్థిని

కామారెడ్డి: ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ఓ బాలిక ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అనంతరం పోలీసులు, సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకొనని బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి కిందకు తీసుకొచ్చారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతం మహ్మద్‌నగర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బూర్గుల్ గ్రామంలో స్రవంతి అనే విద్యార్థి ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చూస్తుండడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి నీటి ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు, సబ్ కలెక్టర్ కిరణ్మయి అక్కడికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు ఏమీ అనకుండా తాను చూసుకుంటానని సబ్ కలెక్టర్ చెప్పడంతో ఆమె కిందకు దిగింది. తల్లిదండ్రులు, బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలకు ఫోన్లు అలవాటు చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
-
Home
-
Menu
