త్వరలో కాజీపేటలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

Ashwini Vaishnaw
X

కాజీపేట: కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో అక్కడ ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. రానున్న ఐదేళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేస్తుందనన్నారు. వీటిని దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.

‘‘కొత్తగా అందుబాటులోకి వచ్చే ఇంటర్ సిటీ రైళ్లు ఆటోమెటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్‌తో రూపొందుతాయి. ప్రతి రైలులో 20 కోచ్‌లు ఉంటాయి. వీటిలో సురక్షితమైన కోచ్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు అమర్చుతాం. ఈ రైళ్లు గంటకు 130 కి.మి. వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తాం. వీటిలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. రైలు బ్రేకులు వేసినప్పుడు అది విద్యుత్ జనరేటర్‌గా మారి.. పునరుత్పత్తి అయిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపే అధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాం’’ అని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

Tags

Next Story