ఎసిబికి చిక్కిన ఇంటర్మీడియట్ అధికారి

X
సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్‌రామ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. సంగారెడ్డిలోని ప్రైవేట్ కాలేజీ ఇన్‌స్పెక్షన్ చేసి పాజిటివ్ నివేదిక ఇవ్వడానికి రూ.50 వేలు డిమాండ్ చేయగా.. గత వారం రూ.30 వేలు జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి ఇచ్చారు. మిగతా రూ.20 వేల కోసం ఫోన్ చేసి అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్యాలయంలో రూ.20 వేలు ఇస్తుండగా ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు.
Next Story
-
Home
-
Menu
