ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

International Short Film Festival
X

International Short Film Festival 

తెలంగాణ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (HISFF) తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఫెస్టివల్ కర్టెన్ రైజర్‌ను టూరిజం ప్లాజాలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాం క కలసి ఆవిష్కరించారు. డిసెంబర్ 19,20,21 తేదిల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ సందర్భంగా టూరిజం భవనంపై ప్రచార బెలున్‌లను కూడా ఎగురవేశారు. ఏడువందల పైగా వివిధ దేశాల నుంచి సైతం వచ్చిన సినిమాల ప్రోమోను ప్రదర్శించారు.

ఈ సందర్బంగా టూరిజం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ వేదికగా ఎదిగిందని, యూరప్, అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని చెప్పారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి 700కి పైగా చిత్రాలు రావడం హర్షించదగిన విషయమని అన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బృందాన్ని అభినందించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దా దాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అధినేత, అంకురం దర్శకుడు ఉమా మహేశ్వర్ రావు, ఎఫ్‌డీసీ డైరెక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు.

Tags

Next Story