దేశ ప్రజల హితమే ధ్యేయంగా బడ్జెట్ : ఈటల

దేశ ప్రజల హితమే ధ్యేయంగా బడ్జెట్ : ఈటల
X

ఢిల్లీ: సిట్ కి లోబడి విచారణ ఉంటుందని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే రుజువైందని అన్నారు. మాజీ సిఎం కెసిఆర్ విచారణపై ఈటల స్పందించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో రాజీ పడకుండా రూ. 53లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని కొనియాడారు. దేశ ప్రజల హితమే ధ్యేయంగా బడ్జెట్ అని.. రూ.1.50 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలియజేశారు. యువతను ప్రోత్సహించేలా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, దేశంలోని అన్ని రంగాలకు పెద్దపీట వేశారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Tags

Next Story