అమెరికా ఎంబసీలపై ఇరాన్ దాడి... హర్ముజ్ జలసంధి మూసివేత

అమెరికా ఎంబసీలపై ఇరాన్ దాడి... హర్ముజ్ జలసంధి మూసివేత
X

దుబాయ్: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది. దీంతో ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయిల్, అమెరికా ఎంబసీలపై డ్రోన్లతో ఇరాన్ దాడి చేస్తోంది. సౌదీ అరేబియా దేశంలోని రియాద్ లోని అమెరికా ఎంబసిపై ఇరాన్ బాంబులతో దాడి చేసింది. భవనం స్వల్పంగా దెబ్బతిన్నట్టు ఆ దేశపు రక్షణ శాఖ తెలిపింది. రియాద్ లో భయంకరమైన పేలుళ్లకు ఇరాన్ పాల్పడుతోంది. 24 గంటల క్రితం కువైట్ లోని యుఎస్ఎ ఎంబసీపై ఇరాన్ దాడి చేసిన విషయం విధితమే. అమెరికా ఎంబసీలపై దాడి చేయడంతో పాటు అమెరికా సైనికుల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో మూసివేశామని ప్రకటించింది. భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలకు ఇంధనానికి జీవనాడి హర్ముజ్ జలసంధి కావడం గమనార్హం ప్రపంచంలో వాడే చమురులో ఐదో వంతు రవాణా ఈ జలసంధి నుంచే జరుగుతోంది. హర్ముజ్ జల సంధి మూసివేస్తే చమురు, ఎల్ఎన్ జి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతి చెందడంతో ఆ దేశం భగ్గుమంటోంది.

Tags

Next Story