రెండు క్షిపణుల కొత్త లాంచర్‌ను ఆవిష్కరించిన ఇరాన్

రెండు క్షిపణుల కొత్త లాంచర్‌ను ఆవిష్కరించిన ఇరాన్
X

టెహ్రాన్: అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సైన్యం సంచలన వీడియా విడుదల చేసింది. కొత్త క్షిపణి ప్రయోగ వ్యవస్థను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇందులో ఆవిష్కరించింది. భూగర్భ సైనిక స్థావరంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ద్వారా ద్రవ ఇంధనంతో పనిచేసే రెండు క్షిపణులను ఒకేసారి ప్రయోగించవచ్చు.ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీ (ఐఆర్‌ఐబీ) విడుదల చేసిన వీడియోలో ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ, ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజీద్ మౌసవి ఈ భూగర్భ క్షిపణి కేంద్రాన్ని పరిశీలిస్తున్నట్లు కనిపించింది.

ఈ కేంద్రంలోని భూగర్భ సొరంగాల్లో ఆధునికీకరించిన, కొత్త తరం క్షిపణులు, అధునాతన ప్రయోగ వ్యవస్థలు, ఇతర సైనిక పరికరాలను నిల్వ చేసినట్లు ఐఆర్‌ఐబీ వెల్లడించింది. అయితే ఈ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.కొత్త క్షిపణులకు అధిక దూరం ప్రయాణించే సామర్థ్యం, మెరుగైన కచ్చితత్వం, ఆధునిక మార్గనిర్దేశక వ్యవస్థలు ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా నిర్వహించే జీపీఎస్ వ్యవస్థపై ఆధారపడకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మార్గనిర్దేశక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

Tags

Next Story