భారత్‌కు 40 వేల ఇజ్రాయెల్ లైట్‌మెషిన్ గన్స్

జెరూసలెం: వచ్చే ఏడాది ఆరంభంలో దాదాపు 40 వేల లైట్‌మెషిన్‌గన్స్‌ను భారత్‌కు సరఫరా చేయనున్నట్టు ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. వీటితోపాటు దాదాపు 1.70 లక్షల కార్బైన్‌లకు సంబంధించిన ఒప్పందం ఖరారు చివరిదశలో ఉందని తెలిపింది. పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్‌గన్స్ సహా ఇతర రక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు భారత హోంశాఖ లోని వివిధ ఏజెన్సీలతో సంప్రదింపులు చేస్తున్నట్టు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఐడబ్లు సీఈవో షుకి స్కాట్జ్ పేర్కొన్నారు. కార్బైన్స్‌కు సంబంధించి 60 శాతం ఆయుధాలను భారత్‌ఫోర్జ్ నుంచి మిగతా నలభై శాతం (1.70 లక్షల ఆయుధాలు) అదానీ గ్రూపు అనుబంధ సంస్థ పీఎల్‌ఆర్ సిస్టమ్స్ సరఫరా చేయనుంది. ఇక ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ అర్బెల్ టెక్నాలజీని భారత్‌కు అందించేందుకు సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నామని షుకి స్కాట్జ్ పేర్కొన్నారు. యుద్ధ భూమిలో సైనికులు అత్యంత కచ్చితత్వంతో , చురుగ్గా వ్యవహరించేందుకు ఇదెంతో ఉపకరిస్తుందన్నారు. ఒప్పందం పూర్తి కాగానే ఇజ్రాయెల్‌తోపాటు భారత్ లోనూ వీటి తయారీ చేపడతామన్నారు.
-
Home
-
Menu
