గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
X

గాజాలో శాంతి స్థాపనకు ఒకపక్క ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మళ్లీ గాజా సిటీపై ఇజ్రాయెల్ సైనిక దళాలు శనివారం ఉదయం విరుచుకుపడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా నగరం లోని ఉత్తర ప్రాంతంతోపాటు, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం కూడా దాడులకు బలైంది. గాజా సిటీ లోని ఒక అపార్ట్‌మెంట్‌పైన, అలాగే ఖాన్ యూనిస్‌లో నిర్వాసితుల శిబిరాలపై జరిగిన దాడిలో మొత్తం 12 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు వేర్వేరు కుటుంబాలకు చెందిన చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అక్టోబరు నెలలో దాడుల విరమణకు ఒప్పందం కుదిరినప్పటికీ, మళ్లీ ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడం అంతర్జాతీయ సమాజంలో కలకలం రేపుతోంది. అక్టోబరు 10న యుద్ధ విరమణకు ఒప్పందం కుదిరిన తరువాత 500 మంది కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించలేదు.

Tags

Next Story