త్వరలో ఐటెల్ నుంచి రెండు సరసమైన స్మార్ట్ ఫోన్స్..

త్వరలో ఐటెల్ నుంచి రెండు సరసమైన స్మార్ట్ ఫోన్స్..
X

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ త్వరలో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్లు జీనో 100 ప్రో, జీనో 100 లైట్ పేరిట మార్కెట్లోకి రానున్నాయి. అమెజాన్‌లో రాబోయే ఐటెల్ జీనో 100 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేస్తూ, కంపెనీ దానికి "బిల్ట్ టఫ్" అనే ట్యాగ్‌ను ఇచ్చింది. ఫోన్ మన్నిక గురించి చెప్పాలంటే, దీనికి MIL-STD 810H ప్రొటెక్షన్ ఉంటుంది. జీనో 100 ప్రోలో ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్ కూడా ఉంది. ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్ ద్వారా ఏసీలు, టీవీలు, సెట్-టాప్ బాక్సులు ఇతర గృహోపకరణాలను నియంత్రించవచ్చు. ఈ రగ్గడ్ స్మార్ట్‌ఫోన్ జూలై 16న భారతదేశంలో విడుదల అవుతుందని కంపెనీ చెబుతోంది. ఐటెల్ జెనో 100 లైట్ విషయానికి వస్తే, ఇది జెనో 100 ప్రో కంటే తక్కువ ధరకే విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని ఫీచర్లును కూడా కంపెనీ అమెజాన్‌లో పంచుకుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ మన్నిక, 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్‌లో DTS-సపోర్ట్ ఉన్న స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.10,000 లోపు ఉండవచ్చని తెలుస్తోంది. ఐటెల్ రాబోయే ఫోన్ రియల్‌మీ P4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్‌తో నేరుగా పోటీపడుతుంది. ఈ ఫోన్ 4G లేదా 5Gకి అనుకూలంగా ఉంటుందా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Tags

Next Story