దానంపై సుప్రీం తీర్పు రాజ్యంగ విజయం: ఏలేటి

X
హైదరాబాద్: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించడం రాజ్యాంగ విజయమని బిజెపి శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బిజెపి చేసిన న్యాయపోరాటం వల్లే ఈ విజయం దక్కిందని చెప్పారు. ఇదే స్పూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టులు, క్షేత్రస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాల్సిన సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం కంచే చేను మేసిన వైనాన్ని తలపించిందని విమర్శించారు. ఇకనైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలన్నారు.
Next Story
-
Home
-
Menu
