జడ్చర్లలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

X
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ట్యాంకర్‌ను వెనుక నుంచి జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్న ట్యాంకర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ట్యాంకర్‌లోని కెమికల్‌తోనే ప్రమాద స్థలంలో పొగ వ్యాపించింది. మాచారం ఫ్లైఓవర్ వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాటైన వాసన, పొగతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
Next Story
-
Home
-
Menu
