సిఎం బందోబస్తులో రోడ్డు ప్రమాదం... డిఎస్ పికి గాయాలు

సిఎం బందోబస్తులో  రోడ్డు ప్రమాదం... డిఎస్ పికి గాయాలు
X
సిఎం బందోబస్తులో రోడ్డు ప్రమాదం... డిఎస్ పికి గాయాలు

జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ కారును లారీ ఢీకొట్టడంతో డిఎస్ పి గాయపడ్డాడు. వెంటనే డి.ఎస్.పీ వెంకటేశ్వర్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ఎస్విఎస్ హాస్పిటల్‌లో డిఎస్ పిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన డి.ఎస్.పీ గారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన గన్‌మెన్, డ్రైవర్‌ను కూడా ఎమ్మెల్యే గారు కలసి ధైర్యం చెప్పారు. వీరందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన వైద్య సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి నిర్వహణకు ఎమ్మెల్యే గారు సూచించారు.

Tags

Next Story